శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
ప్రబోధ సేవా సమితి-ఇందూ జ్ఞానవేదిక మరియు త్రైత సిద్ధాంతము అచ్చంపేట శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నేటి(23 ఆగష్టు) నుండి 31ఆగష్టు వరకు అచ్చంపేట పట్టణంలోని టీచర్స్ కాలనీ నందు నిర్వహించనున్నారు.
ఈ వేడుకలో హిందూధర్మం గొప్పతనంతో పాటు శ్రీ కృష్ణుని గొప్ప ఆధ్యాత్మిక రహస్యములను వివరించనున్నారు.
అలాగే శనివారం (31 ఆగష్టు) రోజు ఉదయం 7 గంటలకు శ్రీ కృష్ణుని రథయాత్ర ఊరేగించ నున్నారు.
కావున ఈ వేడుకలకు పట్టణ ప్రజలు,భక్తులు హాజరై జయప్రదం చేయాలనీ నిర్వాహకులు కోరారు.
ఇతర వివరాలకు సెల్: 9948947630,9440654451,6303455809,9666154190 సంప్రదించగలరు.