శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా అచ్చంపేటలో యాదవులచే ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ఉట్లకోనేరు వద్ద వేడుకగా నిర్వహించారు.ఈ వేడుకలు యాదవ కమిటీ మరియు భ్రమరాంబ దేవస్థానం కమిటీ సంయుక్తంగా నిర్వహించాయి.
భ్రమరాంబ దేవస్థానం కమిటీ శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు.
ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరి కాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.
యాదవ వంశస్తులు గుడిలో పూజలు చేసి ఉట్లు కొట్టారు.
ఈ వేడుకలో మునిసిపల్ చైర్మన్ తులసీరామ్,నరసింహ గౌడ్,తెరాస నాయకులు, కౌన్సిలర్లు,ఆలయ కమిటీ మరియు యాదవ కమిటీ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.