పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ..

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ వద్ద నాలుగు గేట్లు తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెట్టింది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి ఒక లక్ష ఆరు వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏపీ మంత్రి అనిల్, తెలంగాణ మంత్రులు నిరంజన్, శ్రీనివాస్ గౌడ్ కృష్ణమ్మకు పూజలు చేశారు.అటు కృష్ణమ్మ పరవళ్ళును చూసేందుకు పర్యాటకులు కూడా భారీగా తరలివచ్చారు… ప్రస్తుతం శ్రీశైలం వద్ద 880 అడుగుల నీటిమట్టం(పూర్తిస్థాయి 885 అడుగులు) ఉంది.