శ్రీశైలం డ్యాం ప్రమాదంలో గేట్లపై నుంచి నీరు
శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. ఈ డ్యామ్‍కు అమర్చిన క్రష్ గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని డ్యామ్ పర్యవేక్షణ ఇంజనీర్లు అంటున్నారు. స్పిల్‌వే నుంచి నీరు ప్రవహిస్తున్నా.. దాంతో ఎటువంటి ప్రమాదం లేదని వారు స్పష్టంచేశారు.
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో 6గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.