శివ నామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు

కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అచ్చంపేటలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఉదయం నలుగు గంటల నుండే పట్టణంలోని ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి మొదలయింది.ముఖ్యంగా శివాలయాలు దీప,ధూప,నైవేద్యలతో మరియు శివ నామస్మరణతో మారుమ్రోగాయి.
సాయంత్రం భక్తులు భక్తి,శ్రద్ధలతో పూజలు నిర్వహించి నీటిలో కార్తిక దీపాలను వదిలారు.