వీధులను శుభ్రం చేయించిన ప్రత్యేక అధికారి
30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ఉప్పునుంతల మండల కేంద్రంలో అపరిశుభ్రంగా ఉన్న రోడ్లను ప్రత్యేక అధికారులు శుభ్రం చేయించారు.ఎస్సి కాలనీ 3వ వార్డులో సీసీ రోడ్డుల పై వున్న రాళ్లు, మట్టిని డోజర్ సహాయంతో తొలగించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సింగోటం,పంచాయతి కార్యదర్శి మధు,ఉప సర్పంచ్ శ్రీను,కో-ఆప్షన్ బాలరాజు,ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్,వార్డు నెంబర్లు పాల్గొన్నారు.