విష జ్వరాల విజృంభణ
వైరల్ జ్వరాలు విజృంభించడంతో గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా తల్లడిల్లుతున్నాయి.చిన్నపిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఈ విష జ్వరాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఎక్కడ చూసిన ఆసుపత్రిలో నిల్చోడానికి ఖాళీ లేక హాస్పిటల్ ముందు రోగులు బారులుతీరుతున్నారు.
ఇదిలా ఉంటె ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పరీక్షలు నిర్వహించే ల్యాబుల వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం, అలాగే సంచార వైద్యశాలలు కూడా లేకపోవడంతో గ్రామీణులు పట్టణాలోని ఆసుపత్రులకు వెళ్తున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు విషజ్వరాల బారిన ఎక్కువగా పడుతుండటంతో చిన్నపిల్లల ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
ఆసుపత్రుల నిండిపోవడంతో బయట బారులు తీరిన రోగులు