విలీన గ్రామాల క్షేత్ర సహాయకులను ఆదుకోవాలి
గత 12సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తాము చేస్తున్న గ్రామాలు అచ్చంపేట మున్సిపాలిటీలో కలపడంతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
గత కొని నెలల క్రిందట అచ్చంపేట నగర పంచాయతిని, ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్రామాలను విలీనం చేయడంతో ఆ గ్రామాలు పంచాయతి హోదా కోల్పోయి పట్టణంలో అంతర్భాగంగా మారాయి.దానితో ఉపాధి కోల్పోయిన 7 గ్రామపంచాయతీలు నడింపల్లి,పల్కపల్లి,పుల్జాల,పోలిశెట్టిపల్లి,చౌటపల్లి,లక్ష్మపూర్,గుంపన్ పల్లిల క్షేత్ర సహాయకులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.
తమకు కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీల బాధ్యతలను అప్పగించాలని లేదా ప్రత్యామ్నాయ ఉపాధినైనా చూపించాలని వేడుకుంటున్నారు. కలెక్టరు గారిని కలసి తమకు జీవనోపాధి కల్పించాలని కోరామని,అచ్చంపేట మండల పరిషత్ లో విజ్ఞపన పత్రాన్ని ఇచ్చామని తెలియచేసారు. హైదరాబాద్ లోని CRD కార్యాలయంలో కూడా తమకు న్యాయం చేయాలని వేడుకున్నామని,ఉపాధి కార్యాలయం నుండి కూడా తమకు అనుకూలంగా ఉపాధి కల్పించాలని ఆర్డర్లు వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదని తెలియ జేశారు.
తమను క్షేత్ర సహాయకులుగా తొలగించడానికి ఆర్డర్లు కూడా సిద్ధం చేస్తుండడంతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ, తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని కోరుతున్నారు.
అచ్చంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో MPDO గారికి వినవించిన పత్రం
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గార్కి ఇచ్చిన అభ్యర్థన పత్రం