విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బిజెపి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అచ్చంపేట పట్టణంలో బిజెపి ఓబీసీ కార్యదర్శి బాలాజీ,మహిళామోర్చా జిల్లా బిజెపి అధ్యక్షురాలు జానకి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ మాట తప్పారు అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి రవికుమార్, రామచంద్రయ్య,రమేష్, లక్ష్మయ్య, శ్రీనివాసులు, చారి పాల్గొన్నారు.