విప్లవ పోరాటాల యోధుడు కామ్రేడ్ సాయిలు వర్ధంతి సభను జయప్రదం చేయండి
దోపిడీ పాలన అంతమొందించి సమసమాజ నిర్మాణం కోసం పీడిత ప్రజలను ఏకం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ ఎరుకలి సాయిలు 36 వ వర్ధంతి సభను అమ్రాబాద్ మండల కేంద్రంలోని సాయిలు స్మారక స్తూపం వద్ద బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నట్లు కామ్రేడ్ సాయిలు వర్ధంతి సభ నిర్వహణ కమిటీ సభ్యులు తెలియజేశారు.
అమ్రాబాద్ మండలంలోనే పోరాటాల ఆదిగురువు, దోపిడికి వ్యతిరేకంగా పోరాటంలో అమరత్వం పొందిన మన సాయిలన్న ఆశయాల సాధనకు జరిపిన కృషి తీవ్రంగా పరిగణించి మతోన్మాద దోపిడీ శక్తులు 30 october 1984 రోజున అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపి నేటికి 36 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా 36 వ వర్ధంతి సభ బుధవారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు, అన్ని కుల సంఘాలు, ప్రజాసంఘాలు, అంబేద్కర్ సంఘాలు, సాయిలన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వివరాలకు ఎం. పర్వతాలు(విశ్రాంత ఉపాధ్యాయులు)9989772359 ను సంప్రదించగలరు.