విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రయ్య(55) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.
వ్యవసాయ పొలంలో విద్యుత్తీగలు సరిచేస్తుండగా షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంభం పెద్ద దిక్కును కోల్పోవడంతో శోక సంద్రంలో మునిగిపోయారు.
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.మృతుని భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.