విద్యార్థిని అభినందించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం
విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో బుదవారం నాగర్ కర్నూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థం పోటీలో ఉప్పునుంతల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని శృతి ఉన్నత స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రా స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.బాల జంగయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని శృతికి పాఠశాల ఉపాధ్యాయ బృందం వివిధ బహుమతులతో అభినందనలు తెలియజేశారు. అలాగే డిసెంబర్ 1 ఆదివారం రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలో ప్రతిభ చాటి ప్రథమ స్థానంలో నిలవాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.లక్ష్మారావు,శ్రీనివాస్ మూర్తి,శేఖర్ రెడ్డి,శ్యామ్ సుందర్ గౌడ్,అజ్మతుల,సత్యనారాయణ,సతీష్,నాగేశ్వర్ రావు,అనురాధ,అనసూయ,కల్పన,శ్రీలత,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.