విద్యారంగ సమస్యల సాధనే అంతిమ లక్ష్యం
ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యల సాధనే అంతిమ లక్ష్యంగా పిఆర్టియు పనిచేస్తుందని సంఘము రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.అచ్చంపేటలలో సత్యలక్ష్మి ఫంక్షన్ హాలులో సంఘం జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని 20 మండలాలకు చెందిన అధ్యక్ష,కార్యదర్శి ,సభ్యులు హాజరై సంఘం పనితీరును,తాము ఎదుర్కుంటున్న సమస్యలను రాష్ట్ర కమిటీ ముందుకు తీసుకువచ్చారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ…యురేనియం విషయంలో నల్లమల దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిందన్నారు.జిల్లా అధ్యక్షుడు రాంచందర్ రావు, అసోసియేట్ రాష్ట్ర అద్యక్షుడు బిచ్య నాయక్,జిల్లా గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.