విక్రమ్ చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది.

విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యిందో లేదో ఇంకా స్పష్టత రాలేదని… దీనివల్ల మొత్తం చంద్రయాన్-2 ప్రయోగం దెబ్బతిన్నట్లుకాదని చెప్పారు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు. ఇప్పటి వరకు మిషన్ ప్రయోగంకు సంబంధించి 5శాతం మాత్రమే గాడితప్పిందని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లకు సంబంధించి మాత్రమే డ్యామేజ్ జరిగిందని చెప్పారు. మిషన్‌కు సంబంధించి మిగతా 95శాతం చెక్కు చెదరలేదని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-2 ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోందని తెలిపారు. ఈ మిషన్ జీవితకాలం ఏడాది పాటు ఉంటుందని ఆ సమయంలో ఆర్బిటర్ చంద్రుడికి సంబంధించి అనేక ఫోటోలను తీసి ఇస్రోకు పంపుతుందని తద్వారా మరిని ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ల్యాండర్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఫోటోలు తీసి ఆర్బిటార్ ఇస్రోకు పంపుతుందని చెప్పారు.
చంద్రయాన్-2లో స్పేస్‌క్రాఫ్ట్‌లో మూడు పరికరాలు అమర్చడం జరిగింది. అందులో 2,379 కిలోల బరువుండే ఆర్బిటార్, 1,471 కిలోల బరువుండే విక్రమ్ ల్యాండర్, 27 కిలోల బరువుండే ప్రగ్యాన్‌లను పంపడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడింది. ఇదిలా ఉంటే జూలై 22న నింగిలోకి నిప్పులు చిమ్ముతూ చంద్రయాన్ -2 దూసుకెళ్లింది. ఇందుకోసం జీఎస్‌ఎల్‌వీ-ఎంకే 3 రాకెట్‌ను వినియోగించారు. భూకక్ష్యలో ఉండగా ఐదు సవాళ్లను విజయవంతంగా అధిగమించిన చంద్రయాన్-2… ఆపై చంద్రుడి కక్ష్యలోకి సక్సెస్‌ఫుల్‌గా ఇస్రో శాస్త్రవేత్తలు పంపారు.
చివరి నిమిషంలో ల్యాండర్ విక్రమ్ ఆర్బిటార్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రయోగం విఫలమైంది. షెడ్యూల్ సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఆ తర్వాత ఇస్రోకు విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. సిగ్నల్స్ కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పటికీ దొరకక పోవడంతో కారణం ఏమై ఉంటుందో అనేదానిపై శాస్త్రవేత్తలు పసిగట్టే పనిలో ఉన్నారు.