వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది… ఉద్యోగం ఊడుద్ది..

0
Share

ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా తెస్తున్నం. ఇందులో ప్రతి వాక్యం నేను రాయించిందే. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. లేకుంటే వారి ఉద్యోగాలు పోతాయ్‌. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే.

నియంత్రణ కోసమే

ఇంట్లో తల్లి పిల్లలను అనురాగంతో గారాబంగా పెంచుతది. అదే తల్లి చికాకు కలిగిస్తే చెంప మీద చెల్లుమని కొడ్తది. పద్దతి ప్రకారం ఉండాలని కొడ్తది. ప్రభుత్వం కూడా అట్లనే.

ఉద్యోగం ఊడుద్ది..

వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది. ప్రతివార్డుకు ఒక మున్సిపల్‌ ఆఫీసర్‌ను నియమిస్తారు. 85 శాతం మొక్కలు బతకపోతే కౌన్సిలర్‌ పదవి, ఇన్‌చార్జీ అధికారి ఉద్యోగం పోతది.

ఆర్నెల్ల నుంచి వరుసగా ఎన్నికలొచ్చాయి. ఆగస్టు ఐదో పదో 15 తారీఖుకు మునిసిపల్‌ ఎన్నికలు అయిపోతయి. 15 నుంచి రియల్‌ టైం అడ్మినిస్ట్రేషన్‌ చూపిస్తం. అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తం.

ఒక్కరితో కాదు..

ఒక కేసీఆరో ఒక మున్సిపల్‌ మంత్రో ఎమ్మెల్యేనో పనిచేస్తే కాదు. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊర్లో పనిచేయాలి. బహుముఖంగా పనిచేయాలి. కాని ఏకముఖంగా ఒక వ్యక్తి పనిచేస్తే జరిగే పనికాదు.

25 రెట్లు జరిమానా..

స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆస్తి పన్నుల మదింపు విధానం పెట్టినం. మున్సిపల్‌ సిబ్బంది ఏ ఇంటి కొలతలు స్వీకరించరు. ఏ ఇంటి యజమాని స్వయంగా తన ఇళ్లు ఇన్ని చదరపు గజాలుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటది. తప్పుడు ధ్రువీకరణ ఇస్తే 25 రేట్లు జరిమానా వేస్తం.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *