వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
పోలీస్ శాఖ
అయోధ్య తీర్పు నేపథ్యంలో వదంతులు ప్రచారం చేసిన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాట్సాప్లో సందేశాలు పంపించిన కఠిన చర్యలు తీసుకుంటామని వంగూర్ పోలీస్ శాఖ వారు తెలియజేశారు.వాట్సప్ గ్రూపు నిర్వాహకులతో పాటు సందేశాలు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. రెండు మూడు రోజులపాటు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ సందేశాలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వంగూరు పోలీస్ శాఖ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.