వణికిస్తున్న విష జ్వరాలు
మండల ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి.పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి.
గత రెండు రోజుల క్రితం వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందగా, మరొక బాలుడు డెంగీ లక్షణాలతో మృతిచెందాడు.
అచ్చంపేటలోని మారుతీనగర్ కాలనీకి చెందిన హరీఫారవుఫ్ కుమారుడు జహంగీర్(6)కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యులకు చూపించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు.హైదరాబాదులోని యశోదా లో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తుండగా మృతిచెందాడు.కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. జహంగీర్ స్థానిక ఇఛ్డయాన్ పాఠశాలలో యూకేజి చదువుతున్నాడు.