వంగూర్ మండలంలో పర్యటించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
వంగూర్ మండలంలో బుదవారం రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.ఉదయం కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రంధాలయం భవనానికి శంఖుస్థాపన చేస్తారని,అనంతరం కోనేటిపురం గ్రామంలోని రంగసముద్రం చెరువులో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి చేప పిల్లలను నీటిలో వదులుతారని మండల తెరాస పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.