వంగూరు తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆర్.రాజు
వంగూరు మండలం నూతన తాసిల్దార్ గా ఆర్.రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తహసీల్దార్ బదిలీలలో భాగంగా వంగూరు తాసిల్దార్ గా పనిచేస్తున్న కె.నాగమణి చారగొండ మండలానికి బదిలీ కాగా ఆమె స్థానంలో నవాబ్ పేట మండలంలో తాసిల్దార్ గా పనిచేస్తున్న ఆర్.రాజు వంగూరు మండలానికి నూతన తహసీల్దార్ గా వచ్చారు.