లోక్అదాలత్ కు భారీ స్పందన
పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన లోక్అదాలత్ కు మంచి స్పందన లభించింది.
శనివారం అచ్చంపేటలోని జూనియర్ సివిల్ కోర్ట్ ప్రాంగణంలో జడ్జి భవాని అధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోక్అదాలత్ కు వందలాది మంది ప్రజలు తరలి వచ్చారు. రాజీ కుదిరిన కేసులను సీరియల్ నెంబర్ల వారిగా జడ్జి ముందు ప్రవేశ పెట్టి కేసులను కొట్టివేశారు.ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు కొట్టివెయ్యడంతో సంతోషంతో ఇంటిదారి పట్టారు.
పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు.