లేనిటి ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం.
అచ్చంపేట : పట్టాన సమీపాన బోల్గాట్పల్లి స్టేజి వద్ద వున్నా లేనిటి ఫౌండేషన్ లో రెండు రోజులు బుధవరం మరియు శుక్రవారం నాడు ముద్దునూరి కుటుంబం తరుపున అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నారు.
కి.శే. ముద్దునూరి వెంకయ్య, ముద్దునూరి బాలమ్మ ల 12 వ వర్ధంతి సందర్బంగా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దంపతుల జ్ఞాపకార్ధం రెండు రోజుల అన్నదాన కార్య క్రమం లో భాగంగా మొదటి రోజు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు ముద్దునూరి దాసయ్య, మురహరి, సుధాకర్, రవి, మంతరి శెంకరమ్మ, రాగం సుధేష్టమ్మ, బాలకిష్టమ్మ, రాములమ్మ, సృజన, కావ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నెల 10 వ తేదీన మంతటి శెంకరమ్మ ఈ ఆశ్రమం లో వృద్దులకు అన్నదానం చేస్తానని ముందుకొచ్చారు.