లింగాలలో శ్రమదానం
లింగాల మండల కేంద్రంలో సర్పంచ్ కోనేటి తిరుపతయ్య అధ్వర్యంలో 30రోజుల ప్రణాళికలో భాగంగా నేడు నాయిబ్రాహ్మణ సంఘం వారు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో చెత్తచెదారం,గడ్డిని తొలగించి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు రామోజీ,గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్,వార్డు సభ్యులు నాగార్జున,ముక్తార్,సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్,నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాఘవులు,ఉపాధ్యక్షుడు మల్లేష్,ప్రధాన కార్యదర్శి అశోక్,కార్యదర్శి శ్రీనివాసులు,కోశాధికారి లక్ష్మయ్య,గౌరవ అధ్యక్షులు తిరుపతయ్య పాల్గొన్నారు.