లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలి
లైన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని జిల్లా గవర్నర్ బండారు ప్రభాకర్ తెలిపారు. స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు కొత్త అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి 2019-2020 సంవత్సరమునకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో 230 దేశాలలో లైన్స్ క్లబ్ తన సేవలను అందిస్తుందని, విద్య మరియు వైద్య రంగాల్లో తన సేవల పరంపరను కొనసాగిస్తుందని, క్లబ్ ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు,ఆసుపత్రులు సమాజానికి సేవలు అందిస్తున్నవని తెలిపినారు.
కొత్త సభ్యులను లైనిజంలోకి లయన్స్ రాధాకృష్ణ VDG-2 ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా క్లబ్ నియమ నిబంధనలు, విధివిధానాలను కొత్త సభ్యులకు వివరించారు.
అధ్యక్షులుగా జూలూరు ప్రదీప్, కార్యదర్శిగా మండికారి బాలాజీ,కోశాధికారిగా దాచేపల్లి శ్రీనివాసులు ప్రమాణస్వీకారం చేసినారు.
క్లబ్ సభ్యులు నరసింహారావు, చంద్రకుమార్, యు.యల్ చారి, శివ శ్రీనివాసులు, విజయకుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్ గుప్త, వెంకటరమణ, నరేందర్, కృష్ణయ్య,లక్ష్మణ్, వెంకటేష్,శ్రీనివాసులు, గోవర్ధన్, వెంకటరెడ్డి, లింగారెడ్డి,రీజియన్ చైర్మన్ రాజ వర్ధన్ రెడ్డి,రీజియన్ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి,జోన్ చైర్మన్ రామచంద్రారెడ్డి, పాండయ్య, భూపతిరెడ్డి, మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.