లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు సైకిలు పంపిణి
లయన్స్ క్లబ్,స్కూలర్క్ మెడికల్ ఇండియా,హెల్త్ ఫోర్స్ టీంల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాల మరియు అంబటిపల్లి లో 7,8,9 తరగతి చదువుతున్న విద్యార్ధినిలకు 50 సైకిలను పంపిణి చేశారు మరియు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ను అందజేయడం జరిగింది. సాంఘిక సేవ కార్యక్రమాలలో భాగంగా తమవంతు ఇలాంటి సేవ కార్యక్రమాలు మరింతగా విస్తృతం చేయనున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల నాయకుడు కె.టి.తిరుపతయ్య,సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి,లింగాల సర్పంచ్ కె.తిరుపతయ్య,లయన్స్ క్లబ్ గవర్నర్ రవికుమార్ గుప్తా, విశ్వేశ్వర రావ్,ఎంపీటీసీ వసుమతి,విండో డైరెక్టర్ పి. మల్లేష్,తెరాస అంబటిపల్లి నాయకులు మాధవ్ గౌడ్,శివయ్య,మహేశ్,లింగాల తెరాస నాయకులు పోలా శ్రీనివాసులు,లింగాల ప్రధానోపాధ్యాయులు శేఖర్,అంబటిపల్లి ప్రధానోపాధ్యాయులు తాహేర్పాషా,హెల్త్ ఫోర్స్ టీం అధ్యక్షుడు కె. విష్ణు,ప్రదాన కార్యదర్శి రఘుపతి,కోశాదికారి ఎల్.రమేష్,ఉపాధ్యాయులు పురుషోత్తం,శ్రీను,నిరంజన్,వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు.