లత్తిపూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం
ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీశైలంకు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు క్షతగాత్రులను అంబులెన్స్ లో, మరో ఇద్దరిని పోలీస్ శాఖ వారి వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.