రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బుదవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
రంగాపూర్ గ్రామానికి చెందిన గణేష్(17) అతని సోదరునితో కలిసి అచ్చంపేట నుండి రంగాపూర్ వెళ్తుండగా Y జంక్షన్ వద్ద గల రైస్ మిల్ వద్ద పొలం పనులు ముగించుకుని నడింపల్లి వెళ్తున్న కాడిఎద్దులను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయ పడిన వ్యక్తిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.