రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గువ్వల
బల్మూర్ మండల పరిధిలోని జినుకుంట గ్రామంలోని కనకాల మైసమ్మ దేవాలయం నుండి జినుకుంట గ్రామానికి రోడ్డును ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. అనంతరం రోడ్డును త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి బల్మూర్ మండల జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీ,గ్రామ సర్పంచ్,ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు,మండల తెరాస నాయకులు హాజరయ్యారు.