రోడ్డంత చిత్తడే
ఉప్పునుంతల మండలం దేవదారికుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో వర్షం కురిసిందంటే రోడ్డు జలమయం అవుతుంది.వర్షం నీటితో రోడ్డు గుంతలమయంగా మారడంతో గ్రామానికి వెళ్లాలంటే భయపడుతున్నారు.బ్రిడ్జి పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తుండడంతో బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.రాత్రి పూట ప్రయాణం నరకప్రాయంగా మారిందని,ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి వెళ్ళే దారి సరి చేయాల్సిందిగా,బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.