రైతుల కోసం వాల్మార్ట్ ఫౌండేషన్ రూ.34 కోట్ల గ్రాంట్
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంతో పాటు,ఆధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు వాల్మార్ట్ పౌండేషన్ 34 కోట్ల రూపాయలను గ్రాంటుగా ప్రకటించింది.
తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లోని దాదాపు 81 వేల మంది రైతులకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది.దేశంలో రైతుల పరిస్థితి మెరుగు పరిచి,వారి ఆదాయాన్ని పెంచే చర్యల్లో భాగంగా గత ఏడాది సెప్టెంబర్లో వాల్మార్ట్ 2023 వరకు 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించింది.తమ విక్రయ కేంద్రాలను వస్తువుల్లో 25 శాతం వరకు రైతుల నుంచి నేరుగా కొంటామని ప్రకటించింది.