రైతులకు అందుబాటులో వరి విత్తనాలు
ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో ఎంటియు 10-10 వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా వడ్లు కావలసిన రైతులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, భూమి పాస్బుక్ జిరాక్స్ కాపీలు తీసుకొని మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో సంప్రదించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.30 కిలోల వడ్ల బస్తా ధర 750 రూపాయలుగా ఉందని వారు తెలియజేశారు.