రేపు జాబ్ మేళా

0

మహబూబ్ నగర్ రూరల్ జిల్లాలో క్రిస్టల్ మేనేజ్మెంట్ ఫోరం గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ మరియు వరుణ్ మోటార్స్ కంపెనీలలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్,టెలి కాలర్స్,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 300 ఖాళీల భర్తీ కోసం రేపు ఉదయం 10 గంటలకు జాబు మేళా ప్రారంభమవుతుందని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని నిరుద్యోగులు మేళాకు హాజరు కావాలని కోరారు.
అర్హత:పదో తరగతి,ఇంటర్,డిప్లొమా,డిగ్రీ,ఐటీఐ.
వయసు:24 నుండి 35సంవత్సరాలు.
నిరుద్యోగ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్,జీరక్స్ కాపీలు,ఆధార్ కార్డు లతో పిల్లలమర్రి రోడ్డులో గల ఎంప్లాయిమెంట్ ఆఫీస్ వద్ద ఉద్యోగ మేళా ఉంటుందని ,ఎంపికైన వారికీ నెలకు 10వేల నుండి15వేల వరకు జీతం వుంటుందని తెలిపారు.
ఇతర వివరాలకు 9666974704,9959695813 కి సంప్రదింఛగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *