రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం

మలి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఈనెల 25వ తేదీ నుండి ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ…సూర్యపేట జిల్లా హుజూర్నగర్ లో మలి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.కుల వృత్తులకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని,మొదటి విడతలో 3,34,619మందికి పంపిణీ చేశామని,మలి విడతలో 3,62,047మందికి పంపిణి చేయల్సీఉందని తెలిపారు.