రికార్డు స్థాయిలో లడ్డు వేలం పాట
మండల పరిధిలోని తాడూరు గ్రామం లో ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద గ్రామ సర్పంచ్ అలివేల కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన లడ్డు వేలం పాటలో అదే గ్రామానికి చెందిన చెర్ల వేణు 59 వేలకు లడ్డు దక్కించుకున్నాడు గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆయనే లడ్డు దక్కించుకోవడం విశేషం అది కూడా ప్రతి ఏటా రికార్డు స్థాయిలో లడ్డును చేజిక్కించుకొని ఔరా అనిపిస్తున్నాడు అంతేకాకుండా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు చర్ల చంద్రమౌళి, చాకలి లక్ష్మయ్య, పుత్తూనూరి లక్ష్మణ్ గౌడ్ ,చర్ల సతీష్ కుమార్, చర్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు