రాష్ట్రస్థాయి క్రీడలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచండి
జిల్లా తరపున పోటీలో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడలో రాణించాలని అచ్చంపేట సీఐ రామకృష్ణ ఆకాక్షించారు.గత నెల 19న అచ్చంపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలో జిల్లాలోని వివిద సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయలకు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు.వీళ్లు ఈ నెల 12,13 వ తేదీల్లో సూర్యపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలో పాల్గొననున్నారు.
పట్టణంలోని గురుకుల విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి సోలపోగుల స్వాములు సొంత ఖర్చులతో తెచ్చిన దుస్తులను పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ రామకృష్ణ అందజేశారు. పోటీలకు వెళ్ళేముందు విద్యార్థులను అభినందించి,భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి పరశురాముడు, పీడీ వెంకటేశ్వర్లు,పిఈటీ నారాయణ,శివ,శిక్షకుడు శ్రీను, స్వేరోస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.