రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో భాగ్యలక్ష్మి కి ప్రథమ స్థానం
సూర్యపేట లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రతిభ కనబరచి ప్రథమ స్థానంలో నిలిచింది.ఈమెతో పాటు జిల్లాకు చెందిన మరో ఏడుగురు క్రీడాకారులు విజయం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అస్సోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా.సోలపోగుల స్వాములు తెలిపారు.జిల్లాకు చెందిన కె.అరుణ్ కుమార్ జాలిగ్ త్రోలో ద్వితీయ, అండర్-16 విభాగం పరుగులో తరుణ్ ప్రథమ స్థానంలో నిలిచారని అన్నారు.కాగా రమేష్, తరుణ్, మధు, గోపి, అనిల్ విజయం సాధించారన్నారు.ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు విజేతలకు అభినందనలు తెలిపారు.