రవీంద్రభారతిలో సత్కారం పొందిన కవయిత్రి డాక్టర్ సాయి జ్యోతి
బల్మూరు మండల ఉపాధ్యాయురాలు డాక్టర్ సాయి జ్యోతి రవీంద్రభారతిలో సత్కారం పొందారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 316 మంది కవయిత్రుల కవితా గానం, పూల సింగిడి పుస్తక ఆవిష్కరణ మరియు కవి సమ్మేళనం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈ రోజు ఘనంగా జరిగింది.ఈ పూల సింగిడి పుస్తకంలో అచ్చంపేట ప్రాంతానికి చెందిన పోల సాయిజ్యోతి రాసిన కవిత అచ్చయింది.రవీంద్రభారతిలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేసి నిర్వాహకులచే సత్కారం పొందారు.