రక్త దానం చేసిన వారికి దన్యవాదాలు తెలిపిన ఉప్పునుంతల ఎస్సై
అచ్చంపేట పోలీసు స్టేషనులో నేడు జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో రక్తదానం చేసిన ఉప్పునుంతల మండల యువతకు,ప్రజా ప్రతినిధులకు,ప్రజలకు ఎస్సై దన్యవాదాలు తెలిపారు.
లయన్స్ క్లబ్ మరియు పోలీసు శాఖ అధ్వర్యంలో జరిగిన ఈ రక్తదానానికి కేవలం ఉప్పునుంతల మండలం నుండే 130మంది రక్తదానం చేశారు,ఈ సందర్బంగా వారిలోని సామజిక సేవా గుణాన్ని, భాద్యతను కొనియాడుతూ వారికి పేరుపేరున ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.