యురేనియం వ్యతిరేక పోరాట సమితి ధర్నా
“జై నల్లమల జై జై నల్లమల” అని నల్లమల ప్రాంతమంతా మారుమ్రోగుతోంది.సిపిఎం,సిపిఐ,యురేనియం వ్యతిరేక పోరాట సమితి అధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.నల్లమల ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వారిని ఈ ప్రభుత్వం ఆడుకుంటున్నదని,ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేస్తుందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర నాయకులను నల్లమలలోకి రాకుండా ఆడుకుంటున్నారని, అడిగితే జైలు పాలు చేస్తున్నారని రోడ్డు పై బైఠాయించారు.అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ…
స్థానిక ఎం.ఎల్.ఏ బాలరాజు ప్రభుత్వం కేవలం సర్వే కు మాత్రమే అనుమతి ఇచ్చిందని,యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని అంటున్నారని,తవ్వకాలు జరపనప్పుడు ఈ సర్వేలు ఎందుకంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వానికి కేవలం డబ్బు పైనే తప్ప ప్రజల పై ప్రేమ లేదన్నారు, నల్లమల లో పుట్టిన ప్రతి బిడ్డ ఈ పోరాటంలో పాల్గొనాలన్నారు.
ధర్నా కారణంగా మన్ననూర్ భారీ ట్రాఫిక్ ఏర్పడింది.
ధర్నాలో పాల్గొన్న సిపిఎం,సిపిఐ,యురేనియం వ్య. పో. స నాయకులను,ఆమ్రబాద్ ఎంపీపీ శ్రీనివాస్,వట్వర్లపల్లి సర్పంచ్ లక్ష్మణ్ నాయక్,నాయకులను మన్ననూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.