యురేనియం వెలికితీతపై ఉద్యమం ఉధృతం
నల్లమల్ల ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమం ఒక్కటే శరణ్యమని యురేనియం వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ దాసరి నాగయ్య అన్నారు.స్థానిక గిరిజన ఉన్నత పాఠశాల ఆవరణలో యురేనియం వెలికితీత వల్ల వచ్చే దుష్పరిణామాలను గురించి విద్యార్థులకు వివరించారు.
గతంలో డిబీర్స్ బహుళజాతి కంపెనీ వారిని తరిమినట్టుగానే ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసేందుకు మరో రూపంలో వస్తున్న ఇంధనశాఖను కూడా తరిమికొట్టేందుకు విద్యార్థిలోకం ఉవెత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.