యురేనియం తవ్వకాల పై కేంద్ర ప్రభుత్వంతో పోరాడే యోచనలో కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన యురేనియం తవ్వకాల ప్రతిపాదనపై పోరాటం చేసే దిశగా కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రజా ప్రయోజనార్థం యూరేనియం తవ్వకాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇదే విషయమై కమిటీ వేసింది తెలంగాణ కాంగ్రెస్. యురేనియం తవ్వకాలు ఒక్క గిరిజనుల సమస్యే కాదని, రాష్ట్రానికి సంబంధించిన సమస్య అని, దీనిపై పోరాటానికి సీనియర్ లీడర్ వీహెచ్ అధ్యక్షతన కమిటీ వేశారు.
యూరేనియం తవ్వకాలు సాగితే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని, కొందరు పిచ్చివాళ్లు అవుతారని, వికలాంగులు అవుతారని, ఎక్స్ పర్ట్స్ ను పిలిచి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఇదే సంధర్భంగా మాట్లాడిన వీహెచ్.. యురేనియం తవ్వకాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారని, యురేనియం తవ్వకాలపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యురేనియం తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యం అని అందుకే జీవితాలను నాశనం చేసే యూరేనియం తవ్వకాలను ఆపాలని కోరారు.