మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు ఆమోదం.

0

డ్రైవింగ్ లైసెన్స్ ల జారి, ట్రాఫిక్ నిబంధనలు మరింత పటిష్టం చేస్తూ ఏర్పాటు చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 108 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు పోలయ్యాయి.ఈ బిల్లు గత నెల 23న లోక్ సభ ఆమోదం పొందగా రాజ్యసభలో జూలై 31న ఆమోదించారు.

రహదారి భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ చట్టం తీసుకువచ్చిందని కేంద్రం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు.రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ బిల్లు తెచ్చామని,ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందితేనే డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారని అందుకు ఎవరూ మినహాయింపు కాదని ఆయన తెలిపారు.
ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించే విధంగా ఈ బిల్లు రూపొందించారు.

  • రోడ్డు ప్రమాదంలో మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లు రూపొందించారు.
  • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు (5,00,000) ఐదు లక్షలు, క్షతగాత్రులకు రెండున్నర లక్షలు పరిహారం అందనుంది
  • అత్యవసర వాహనాలకు దారివకుంటే 10 వేల జరిమానా
  • డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే (1,00,000) లక్ష రూపాయల వరకు జరిమానా
  • వాహన బీమా లేకుంటే (2,000) రెండు వేల రూపాయలు
  • హెల్మెట్ ధరించకుంటే (1,000) వెయ్యి రూపాయలతో పాటు మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసారు
  • బాలలకు వాహనం ఇస్తే యజమానికి 3 ఏళ్ళు జైలు తో పాటు 25,000 వేల జరిమానా
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 వేలు జరిమానా
  • ప్రమాదకరమైన డ్రైవింగ్ కి 5,000 వేలు జరిమానా
  • మద్యం తాగి వాహనం నడిపితే 10,000 వేలు జరిమానా
  • వాహనాలలో ఓవర్లోడ్ కు 20,000 వేలు జరిమానా విధించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *