మొక్కలు నాటుదాం మన గ్రామ్మాన్ని కాపాడుకుందాం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంధర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో డా. బాల్ నారాయణ (శ్రీనివాస హాస్పిటల్) గారి చేతుల మీదుగా ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సంధర్భంగా డా. బాల్ నారాయణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ఎవరి పరిసరాలు వారే శుభ్రం చేసుకుని ఆదర్శంగా నిలవాలని, ఫల వృక్షాలను పెంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా జీవించాలని కోరారు.
ఈ సందర్బంగా క్లాస్ మేట్ జిల్లా కార్యదర్శి శ్రీ నాగారం వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… అందరం ఇండ్ల వద్ద, పోలాల్లో ఇంకుడు గుంతలు తవాలని , పోలాల్లో వాలు కట్టలు, కాంటూర్ కందకాలు ఏర్పాటు చేసుకుని వాటిపై మొక్కలను పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అచ్చoపేట క్లాస్ మేట్ క్లబ్ అధ్యక్షులు వెంకట్ రాజు, సభ్యులు B. శ్రీనివాసులు, రాము తదితరులు పాల్గొన్నారు.