మేఘం నేలతల్లిని ముద్దాడిన దృశ్యం
ఆదివారం కురిసిన వర్షానికి మేఘం నేలపైకి దిగి వచ్చింది.
చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉమామహేశ్వర క్షేత్రం, ప్రతాప రుద్రుని కోట వంటి ప్రాంతాల్లో మేఘం కిందికి దిగి వచ్చి నేల తల్లిని,కొండలను ముద్దాడుతూ వెళుతున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.
ఆదివారం కావడంతో శ్రీశైలం నుంచి వచ్చే యాత్రికులు కార్లు ఆపి, చల్లటి వాతావరణంలో ఈ సుందర దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు,సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.