మెదడు చురుగ్గా పనిచేసేందుకు అద్భుతమైన చిట్కాలు..!
![Achampeta News](https://www.achampeta.com/wp-content/uploads/2019/03/brain.jpg)
మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుని ప్రశాంతమైన జీవనం సాగించాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుకోవాలంటే.. మెదడును యాక్టివ్‌గా ఉంచాలి. దాని పవర్‌ను పెంచాలి. అందుకోసం కింద సూచించిన టిప్స్ పాటిస్తే చాలు. దాంతో మెదడు చురుగ్గా మారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. రోజూ కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. దాంతో మెదడు పునరుత్తేజం చెందుతుంది. మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు పోయి మెదడు చురుగ్గా మారుతుంది.
2. మనం నిత్యం తీసుకునే ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కనుక రోజూ సరైన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
3. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కూడా మానసిక సమస్యలు పోయి మెదడు చురుగ్గా మారుతుంది.
4. రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం, పదవినోదం, పజిల్స్ నింపడం, సుడోకు ఆడడం వంటి మెదడుకు మేత పనులు చేస్తే మెదడు పనితీరును మెరుగు పరుచుకోవచ్చు. దీంతో మానసిక సమస్యలు ఉండవు.