ముస్లిం సహోదరులు అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ముస్లిం సహోదరుల పవిత్ర దైవం మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా ఆదివారం ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు.
బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో ముస్లిం సహోదరులు,పీపుల్ ఫౌండేషన్ మరియు హైదరాబాద్ లోని THUMBAY హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా కుల మతాలకు అతీతంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వైద్య శిబిరంలో అనారోగ్యముతో బాధ పడుతున్న వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్స్ అందజేశారు.