మున్సిపాలిటీ చెత్త వ్యాన్ లను అడ్డుకున్న కాలనీ వాసులు
అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో రోడ్డు పక్కన చెత్త డంపింగ్ చేస్తుండడంతో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తూ చెత్త వ్యాన్ లను అడ్డుకున్నారు. డంపింగ్ యార్డును ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు.చెత్త డంపింగ్ చేస్తుండడంతో దుర్వాసన వెదజలుతుందని,తాము రోగాల బారిన పడుతున్నామని,ఇక్కడ చెత్త వేస్తుండడంతో పందులు, కుక్కలకు ఆవాసంగా మారి స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.