మున్సిపాలిటీలుగా మారినా పట్టించుకోని మురుగు సమస్య
శేఖరయ్య గార్డెన్స్ సమీపంలోని ఏపిఎం కాలనీలో మురుగు సమస్య వేధిస్తోందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం దోమలతో సావాసం చేస్తున్నామని,పిల్లలకు డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయని, విధి లైట్లు కూడా సరిగా లేకపోవడంతో ఒక్కోసారి కాలనీ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుందని వాపోయారు.