మునిసిపల్ అభివృద్దికి నిధులు మంజూరు చేయించాలని ఎంపీకి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు మంజూరుచేయించాలని విజ్ఞప్తి చేస్తూ ఎంపీ పోతుగంటి రాములును ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వినతి పత్రం సమర్పించారు.
దానికి ప్రతి స్పందనగా ఎంపీ మాట్లాడుతూ…మున్సిపాలిటీ అభివృద్దికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పోకల మనోహర్,మునిసిపల్ చైర్మన్ తులసి రామ్,కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.