ముదిరాజ్ తాలూకా స్థాయి పట్టభద్రుల సమావేశం
అచ్చంపేట పట్టణంలోని ఎస్.వి.ఆర్ గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో ముదిరాజ్ తాలూకా స్థాయి పట్టభద్రుల సమావేశం నిర్వహించారు.
అచ్చంపేట తాలూకా ముదిరాజ్ అధ్యక్షులు సుంకనమోని మల్లేష్ అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశానికి రాష్ట్ర ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి మెట్టుకాడి శ్రీనివాసులు గారు హాజరై ప్రసంగించారు.
ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏ కి మార్చాలనే ప్రదాన డిమాండ్ తో కొనసాగిన ఈ సమావేశంలో ముదిరాజుల రాజకీయ,విద్యా,ఆర్ధిక,సామాజిక అంశాల పై చర్చ జరిగింది.
ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ…రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజులు అన్నీ రంగాలలో వివక్షతకు గురి అయ్యారని, రాజకీయంగా సాధికారత పొందే సమయం ఆసనమైందని అన్నారు.మండలాల వారిగా ముదిరాజుల గణన చేపట్టి అన్ని రంగాల్లో మనకు రావలసిన వాటాను పొందుదామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెం.74 తో ముదిరాజులు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని, దానిని ఉపసంహరించే దాకా పోరాడదామన్నారు.
మండల అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ…అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.15 ద్వారా ముదిరాజులను బీసీ-ఏలో చేర్చినప్పటికీ కొన్ని కులాలు హై కోర్టును ఆశ్రయించి ఆ జీవో ను నిలుపుదల చేసారని,సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఏడు జిల్లాలో పర్యటించి సమగ్ర నివేదికను తయారుచేసిన బీసీ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేటి వరకు కూడా రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించకుండా జాప్యం చేస్తుందన్నారు.విద్యా, ఉపాధి అంశాల్లో పోరాటం చేసి మన వాటాను,హక్కులను పొందుదామన్నారు.
ఈ సమావేశానికి అచ్చంపేట నియోజక వర్గంలోని సంఘం సభ్యులు మరియు మండలాల వారిగా పట్టభద్రులు పాల్గొన్నారు.