• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ముఖం చాటేసిన్న వానలు-దిక్కు తోచని స్థితిలో రైతులు.

Share Button

రుతుపవనాల రాక ఆలస్యమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు సందిగ్ధంలో పడ్డారు, ముఖ్యంగా గత వారం పడిన వానకు కొంతమంది పత్తి, జొన్నలు వేశారు,తరువాత వర్షాలు కురవక పోవడంతో చాలా వరకు విత్తనాలు మొలకెత లేదు.బోరు బావులు ఉన్న వారు మోటార్ల సహాయంతో తడి వేస్తుండగా, బోర్లు లేని రైతులు ఆకాశం వైపు చూస్తు, మేఘాల రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు అవి సరిగ్గా మొలకెతక పోవడం వాటిని మళ్ళి దున్ని వానలు పడితే విత్తనాలు వేయడానికి సిద్ధం అవుతున్నారు.

గతేడాది కూడా ఇలాగే వర్షాలు కురవక పోవడంతో మొక్కజొన్నను సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. అందువల్ల ఈసారి రైతులు మొక్కజొన్న సాగుకు దూరంగా ఉంటున్నారు. మృగశిరకార్తి ముగియడానికి వారం రోజులు మాత్రమే ఉండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. కార్తీ వెళ్లిపోతే తరువాత విత్తనాలు వేసినా ప్రయోజనం ఉండదని భయపడుతున్నారు. కేంద్ర వాతావరణ సంస్థ కూడా తమిళనాడు తో సహా తెలంగాణ మరో ఆరు ఇతర రాష్ట్రాలు ఈ సంవత్సరం కరువుకు గురయే అవకాశముంది అని హెచ్చరికలు జారీ చేయడం మరింత ఆందోళన కలిగించే అంశం.

ఈ రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణాలో ప్రవేశించే అవకాశం ఉందనే వార్త, మళ్ళి రైతులకు ఆశలు రేకితిస్తూన్నాయి.

ఏదిఏమైనా ఈ సంవత్సరం వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతుల ముఖంలో చిరునవ్వులతో వెలగాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
జై జవాన్-జై కిసాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat